Friday 10 January 2014

తెలుగు విభాగం - వృత్తి /ఉద్యోగం

తెలుగు విభాగం

వృత్తి / ఉద్యోగం

వృత్తిపరమైన మనుషులు వైవిధ్యభరితంగా చూస్తారు. ప్రత్యేకమైన వృత్తుల్లోని వాళ్ళను   వారికి సంబంధించిన ప్రత్యేక పదాలుంటాయి. మనం ఉత్పత్తికోసం పనిచేయడమే కాదు, కాలానికి కూడా విలువనివ్వాలి. నమ్మకంగా రోజుకు 8 గంటలు పనిచేసే నువ్వు నాయకుడివి కావచ్చు. అయినా, 12 గంటలు నిర్విరామంగా పని చేయవలసి కావచ్చు.  నైపుణ్యం ఉంటే, అవకాశం అదే వస్తుంది. కాని, ఒక్కొక్కసారి కోర్కె ఉంటే అవకాశమే కాదు, దానిలోని నైపుణ్యమూ వస్తుంది. నీకు కష్టసాధ్యమేననుకున్న పనినే ఎంచుకో. ఎక్కడ పనిచేయాల్సిన మనిషి అక్కడ పనిచేయకపోతే, పక్కకు తొలగినట్లే. అతను బాధపడడమే కాక ఇతరులకు బాధ కలిగిస్తాడు. జీవితం ఉన్నతమైనప్పుడు, ఆ స్థానంలో అది ఉండటమే అందం. వేరే స్థలంలో అంత అందంగా ఉండదు. ఏ మనిషి నిజమైన పని ఏదో ఆ దేవుడికే తెలుసు. ప్రజలే కనుక పని కోరితే మనం యింకా కర్రపుల్లలతో భూమిని దున్నుతాం. వస్తువుల్ని మనం నడుం మెడ వేసుకుని గమ్యానికి చేర్చుతున్నాడు.
వైద్యం ఎల్లప్పుడూ మానవాళికి సేవలందించే వృత్తి. అది అలాగే ఉంటుంది.
 
ప్రతీ వృత్తిదారుడు కూడా ప్రజలను, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  కుట్రచేయడం వృత్తిలో భాగమైపోయింది. ఏ వృత్తిలోనూ భవిష్యత్తు కనిపించదు. భవిష్యత్తు ఆ వృత్తిని   చేపట్టే వ్యక్తిని బట్టి ఉంటుంది. 
 
జీవనార్థంగా లోకులు ఆచరించే అన్ని వృత్తుల్లోనూ, అంతో యింతో హేయత్వం ఉండే తీరింది. వృత్తులు పారంపర్యం చేయటంవల్ల కొన్ని సంఘాలకు అన్యాయం కలిగింది. కొన్ని వృత్తులు నశించటంతో ఈ అన్యాయం మరీ ఎక్కువైంది. ఎవరి వృత్తి ఎవరు మానుతారు? లంచం, పంచం తినడం ఉద్యోగాధర్మంగా మారిపోవడం బాధాకరం. విత్తం మనిషి చిత్తాన్ని లొంగదీసుకోవడంలో విజయాన్ని సాధించుకుంది. ఈ భూమ్మీద చాలామందికి తమ వృత్తులమీద ప్రేమ,  ఏవగింపూ రెండూ లేకుండానే బతికేస్తారు.
 
వృత్తికీ, ఉద్యోగానికీ పెద్ద తేడా లేదనే చేపాలి. నిరుద్యోగ స్థితికి విముక్తి లభించేది ఉద్యోగం. ఉద్యోగ ప్రస్తాన పరంపరలు వృత్తి అనే చెప్పాలి.
 
ఉద్యోగ మొదవినప్పుడు,
సద్యోమద మొదవి పూర్వసరసతలుడుగున్
విద్యావంతున కైనను
విద్యాహీనునకు వేరే వివరంబెలా?
 
ఉద్యోగమంటే అమ్ముకుపోవడమే. ఆత్మాభిమానాన్ని చంపుకోకపోతే, యీ రోజుల్లో చెయ్యలేం. ఉద్యోగి విషం తాగి చావలన్నా మొదటి తారీఖున కాని కుదరదు. ప్రభుత్వరంగం ఉద్యోగాల్లో, చిన్నా పెద్దా తారతమ్యాలూ, చిన్నవాళ్ళూ, పెద్దవాళ్ళూ కూడా మరచిపోలేరు. నలభై వసంతాలు ఉద్యోగాన్ని వెలగబెట్టిపుష్కలంగానా, పదవీ విరమణ భ్రుతిని పుష్కళంగా పుచ్చుకుంటున్నా, మళ్ళీ ఉద్యోగాలకు అర్జీలను పెట్టడం ఆత్మాభిమానాన్ని చంపుకోవడం కాక మరేమిటి? ఆఫీసులను కనిపెట్టుక సాఫీగా బతుకుతాం, అంతరాత్మలను పెంపుడు జంతువులుగా పెంచుతాం అన్నాడు త్రిశంకు స్వర్గాన్ని వర్ణించిన ఓ ఉద్యమ కవి. అంతేకాక, పాపంలా, అసమర్థుని కోపంలా, పెరుగుతున్న దస్త్రాల్లోని ఉష్ట్రపక్షి భంగిమలో తలలుదూర్చే వైనాల్ని చూడడంలో నవ్వూ, ఏడుపూ సమాంతరంగా వస్తాయి. ఓర్పుతో గాడిదలకు ఓనమాల్ని దిద్దించడం, అతివినయంతో నక్కల ఆధిక్యతని పెంచుకోవడమే.
 
ప్రజలు ఎలాగోలాగా మంచితనంతో ఉద్యోగస్థులను సమాదానపరచుకోకపోతే, వాళ్ళు పెట్టే తంటాలు పడలేని దుస్థితి. ఉద్యోగాల్లో మర్యాదలు లేకపోవడానికి కారణం, మర్యాడమీద నిలబడకుండా, లంచం, అవినీతిపై ఆధారపడుతూ ఉద్యాగాలు చెయ్యడానికి సంసిద్దులౌతున్నవాళ్ళే అధికం. చదువుకున్నవాళ్ళు కూడా ఉద్యోగం, లేదా భ్రుతి అన్న వాదాన్ని వదిలి, యితర సేవా వ్యాపార రంగాల్లో ప్రవేశించవలసిన అగత్యం, అవసరం రెండూ వచ్చాయి. ఉద్యోగమూ, ఆత్మాభిమానమూ రెండూ కలసినచోట, రెంటికీ యిబ్బందులొస్తున్నాయి.  
 
ఉద్యోగాన్ని గొప్ప యోగంగా భావించే రోజులు పోయాయి. ఉద్యోగస్తుల్లో, శ్రమశక్తిని పరువుగా భావించే ప్రవర్తనలు, నడతలు మృగ్యమైపోయాయి. ఉద్యోగం  ఒకడిస్తే వచ్చేది కాదు, చేస్తేనే నిలిచేదన్న భావం తగ్గిపోవడంతోపాటు, ఉద్యోగం ఒక హక్కుగా శాసనాల్ని ప్రజలమీదకు అస్త్రాల్లా వదిలి, రాజకీయ రాక్షసిని ఉసికొల్ప డం రివాజుగా మారిపోయింది. ఉద్యోగాలతోపాటు, తెలుపును నలుపుచేసే  కాగితాలు, రంగురంగుల దస్త్రాలు, గుచ్చుకునే గుండుసూదులు, నొక్కిపెట్టే క్లిప్పులు, ఎంతకీ ఊడిపోని తెల్లజిగురులు, త్వరిత గమనాలు, గుప్తప్రస్థానాలు, ఆరోహణావరోహణాది దిశానిర్దేశాలు, కాలయాపనల మధ్య తీసుకున్న నిర్ణయాలు నిరర్థక ప్రక్రియలుగా మారుతున్నాయి.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
   

No comments:

Post a Comment